విదేశాల్లో వైద్య విద్య అవకాశాలపై... గుంటూరులో నిర్వహించిన అవగాహన సదస్సుకు నియో గ్రూప్ ఎండీ డాక్టర్ దివ్యరాజ్ హాజరయ్యారు. నీట్ పరీక్షకు 15 లక్షల మంది పోటీపడుతుంటే 65 వేల సీట్లు మాత్రమే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అక్కడ సరైన సంస్థలను ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా,సంపూర్ణమైన అవగాహనతో వైద్య విద్యను పూర్తి చేయవచ్చని సూచించారు. తమ నియో గ్రూప్ ద్వారా 20 ఏళ్లలో 3 వేల మంది వైద్యులును అందించామని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విదేశాల్లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లి... వారికి ఇష్టమైన క్యాంపస్ లో చేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 14న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఎంబీబీఎస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తునట్లు సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు.
ఇదిచూడండి.అసోం వరదల్లో ఆరుకు చేరిన మృతులు