కరోనా వైరస్ని కట్టడి చేయడానికి కరచాలనాలు వద్దు.. నమస్కారమే ముద్దు అంటూ నినాదాలతో గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వం కరోనాపై తీసుకొచ్చిన నోటీసును అందజేస్తున్నామని మున్సిపల్ ఆరోగ్య అధికారి రమణ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు సహకరించాలని కోరారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదని.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని అన్నారు.
ఇదీ చదవండి: ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు