గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని మలకపేట వద్ద ఆటో-లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు.. ఆటో క్యాబిన్లో చిక్కుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్యాబిన్ నుంచి ఆటో డ్రైవర్ను బయటకు తీశారు. ఆంజనేయులుకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.