కరోనా కట్టడిలో ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు అపూర్వం. ఇంటిని వదిలి.. లాక్డౌన్లో ఆసుపత్రుల్లో వైద్యులు సేవలందిస్తుంటే.. గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారుల సూచనలతో... ఇంటింటికీ వెళ్లి బాలింతలు, గర్భిణులకు సూచనలు చేస్తూ.. వారికి అవసరమయ్యే మందులు అందిస్తున్నారు.
మధుమేహం, రక్తపోటు, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడినట్టుగా వారి దృష్టికి వస్తే.. వెంటనే అధికారులకు సమాచారం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనూ.. వారు తమ సేవలతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇదీ చూడండి: