ETV Bharat / state

ఇసుక భోంచేస్తున్నారు..! - గుంటూరు జిల్లా తాజా సమాచారం

అక్రమార్కులు ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో కృష్ణానది గుల్లవుతోంది. నదీగర్భంలో నీరు వస్తున్నా భారీయంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. అక్రమాలే సరిహద్దుగా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి ఇసుక తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దారి ఏర్పాటు చేసుకుని నదీ ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.

sand excavations
sand excavations
author img

By

Published : Mar 13, 2022, 3:26 PM IST

కృష్ణా నదిలో నిబంధనల మేరకు 3అడుగుల లోతు వరకే ఇసుక తవ్వి తరలించాలి. ఇందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లాలోని బొమ్మవానిపాలెం, అత్తలూరివారిపాలెం రీచ్‌ల్లో 10అడుగుల లోతుకు పైగా తవ్వకాలు చేస్తున్నారు. 4 అడుగుల తర్వాత నదీగర్భంలో తవ్వకాలు చేసే క్రమంలో నీరు ఉబికివస్తోంది. ఈ క్రమంలో నీటిలో నుంచి తీసిన ఇసుకను పక్కన వేసి నీరంతా వెళ్లిన తర్వాత.. లారీలకు లోడ్‌ చేస్తున్నారు. అయినా లారీల్లో ఇసుక తరలించే క్రమంలో నీరు కారుతూనే ఉంటోంది. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇదే అదనుగా అక్రమార్కులు భారీ యంత్రాలతో నిత్యం తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కృష్ణానది పరిరక్షణ విభాగం ఇంజినీర్లు సూచించిన ప్రాంతంలోనే దారి నిర్మించుకోవాల్సి ఉండగా ఎక్కడ పడితే అక్కడ దారి, రింగ్‌లు ఏర్పాటుచేసుకున్నారు.

కృష్ణానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

ఇష్టానుసారంగా తవ్వకాలు..
భూగర్భ గనులశాఖ సూచించిన నిర్దేశిత ప్రాంతంలో తవ్వకాలు చేయాలనేది నిబంధన. ఒక్కొక్క రీచ్‌కి 5 హెక్టార్లకు మించకుండా అనుమతులు మంజూరు చేశారు. ఈ లెక్కన గరిష్ఠంగా 70వేల టన్నుల వరకు ఇసుక తరలించవచ్చు. అనుమతి ఇచ్చిన ప్రాంతానికి సరిహద్దుగా రాళ్లు ఏర్పాటుచేసుకుని తవ్వకాలు చేయాలి. కానీ కొల్లిపర మండలంలోని రీచ్‌ల్లో ఎక్కడా సరిహద్దు రాళ్లు కనిపించకపోవడం గమనార్హం. దీనికి తోడు అత్యంత లోతుగా తవ్వకాలు చేయడం వల్ల అనుమతి ఇచ్చిన పరిమాణం కంటే అధిక మొత్తంలో ఇసుక తరలిపోతోంది. అత్యంత లోతుకు తవ్వకాలు చేయడం వల్ల పరిసరప్రాంతాల్లో భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడనుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఘాటు... తవ్వకాల్లో భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఇసుక తవ్వుతున్న ప్రాంతంలో ఎటుచూసినా గోతులే కనిపిస్తున్నాయి. గోతుల్లో నీరు వచ్చి నిలిచిన తర్వాత అక్కడ తవ్వకాలు ఆపి మళ్లీ పక్కనే చేపడుతున్నారు.

తగిన చర్యలు తీసుకుంటాం..
కొల్లిపర మండలంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి 18టన్నుల లోడ్‌తో నిత్యం లారీలు గ్రామీణ రహదారులపై తిరుగుతున్నాయి. కొల్లిపర నుంచి నందివెలుగుకు వెళ్లే రహదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొల్లిపర మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై క్షేత్రస్థాయి విచారణ జరిపిస్తామని... భూగర్భగనుల శాఖ ఉపసంచాలకులు తెలిపారు. అక్రమాలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: NGT On Illegal sand mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సమాధానమివ్వండి...ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.