ETV Bharat / state

నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సరికొత్త ఆలోచన - ఏపీఎస్​ఆర్టీసీ సరికొత్త ఆలోచన

కరోనా కష్టాలతో కుదేలైన ఆర్టీసీ...నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ప్రయాణికుల తరలింపు వల్ల భవిష్యత్తులో లాభాలు రావని అంచనాకు వచ్చిన సంస్థ.. ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టింది. ఆర్టీసీ పార్సిల్ సర్వీసును భారీగా విస్తరించాలని, లాజిస్టిక్స్ పేరిట పెద్ద ఎత్తున సరకు రవాణా చేయాలని నిర్ణయించింది. దీంతో ఏటా 2 వేల కోట్ల మేర ఆదాయాన్ని పొందడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

apsrtc plans
apsrtc plans
author img

By

Published : May 14, 2020, 2:06 PM IST

లాక్ డౌన్ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ ఆర్ధికంగా చితికిపోయింది. రోజూ కోటిమందికి పైగా ప్రయాణికులను గమ్య స్థానాలకు తరలించే ఆర్టీసీకి రోజుకు 16 కోట్ల మేర రాబడి వచ్చేది. కరోనా వ్యాప్తి కారణంగా నెలన్నర రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సుమారు 800 కోట్ల రాబడిని కోల్పోయింది. లాక్ డౌన్ అనంతరం ఆర్టీసీకి గడ్డుకాలమే. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులను చేరవేయాల్సి ఉంటుంది. దీంతో బస్సులో సగం సీట్లతోనే నడపాలని నిర్ణయించింది. ఈ కారణంగా రాబడి రాకపోగా.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వని పరిస్ధితి ఉండటంతో.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ప్రయాణికుల రవాణా ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని ప్రత్యమ్నాయ మార్గాల్లో రాబట్టుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఆర్టీసీ ఇప్పటికే పార్సిల్ సర్వీసును విజయవంతంగా నడుపుతోంది. లాభదాయకంగా ఉండటంతో దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్ధకు భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే సరకు రవాణాను విస్తరించడమే ఏకైక మార్గంగా భావిస్తోంది.

సరకు రవాణాను మరింత విస్తరించాలని నిర్ణయించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను కార్గో ద్వారా 2 వేలకోట్ల రెవెన్యూ సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించి తగు చర్యలు తీసుకోవాలని అన్ని డిపోలు, రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. పెద్దఎత్తున సరకు రవాణాను చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆర్డర్లను సేకరించాలని నిర్ణయించింది. ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ ఫెడ్, ఆగ్రోస్, పౌర సరఫరాల సంస్థ, ఏపీ బేవరేజ్ కార్పోరేషన్​తోపాటు ఇతర శాఖలు, సంస్థలకు చెందిన సరకులను రవాణా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఆర్టీసీకి ఆర్డర్ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. దీంతో ఆర్టీసీ లాజిస్టిక్స్​ను విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సరకు తరలింపు కోసం వాహనాలను సమకూర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఆర్టీసీకి ప్రస్తుతం 12 వేల బస్సులు న్నాయి. వీటిలో కాలం చెల్లిన బస్సులను సరకు రవాణా వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. అన్ని వర్క్ షాపులను తెరచిన ఆర్టీసీ.. ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రతి డిపోలో 2 నుంచి 3 బస్సులను సరకు రవాణ వాహనాలుగా మార్చాలని సూచించింది. కంటైనర్ కల్గిన ట్రక్కులులాగా వీటిని మార్చుతున్నారు. వీటిలో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ సామాగ్రి, చౌకదుకాణాల బియ్యం, సహా ఇతరత్రా సరకులను పెద్దఎత్తున తరలించనుంది.

ఆర్టీసీ లాజిస్టిక్స్ పేరిట ఈ సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ విభాగాల ద్వారా వచ్చే ఆర్డర్లు ఇప్పటి వరకు వందలకోట్ల ఆర్డర్లు ప్రైవేటు వారికి వెళ్తుండగా.. ఇకపై ఆర్టీసీ పరం కావడంతో ఆదాయం బాగానే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులను కంటైనర్ తరహా ట్రక్కుగా మార్చినా.. వాటిలో 8 నుంచి 9 టన్నలు సరకు మాత్రమే రవాణా చేసేందుకు వీలుంది. దీనివల్ల బయట నుంచి లారీలను అద్దెకు తీసుకోవాలని సంస్ధ నిర్ణయించింది.

25,30,40 టన్నుల మేర తరలించే కంటైనర్లు సహా.. వెనక తెరచి ఉండే వాహనాలకు జిల్లాలవారీగా టెండర్లు పిలిచి అద్దె లారీల ధరలను ఖరారుచేయాలని ఆదేశించారు. డ్రైవర్ తో కానీ ,డ్రైవర్ లేకుండా గానీ లారీలను అద్దెకు తీసుకోనున్నారు. లారీని మాత్రమే అద్దెకు ఇస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో లారీ నడిపించాలని భావిస్తున్నారు. కొన్ని లారీలను కొనుగోలు చేయడం పైనా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు రుణంతో లారీ కొనుగోలు చేసి , వాయిదాలు చెల్లించలేక సీజ్ చేసిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి ద్వారా ఆదాయం ఆర్జించి సంస్థను కాపాడు కోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఇదీ చదవండి: వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.