- ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం: సీఎం
CM And Governor At Constitution Day Program: రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త అని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- కొవ్వూరు టీడీపీలో చెలరేగిన విభేదాలు
TDP : తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల కోసం సమావేశమైన సభ వేదిక పైకి మాజీ మంత్రిని పిలవక పోవటంతో విభేదాలు చెలరేగాయి.
- దిల్లీలో గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్న.. రాజధాని రైతులు...
Amaravati farmers Delhi tour: అమరావతి ఉద్యమం మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని రైతులు దిల్లీ యాత్ర చేపట్టనున్నారు. తుళ్లూరులో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అమరావతి పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తమ గోడు వినిపించేందుకు దిల్లీ యాత్ర చేస్తున్నట్లు ఐకాస నేతలు తెలిపారు.
- నెల్లూరు నగర తెదేపా ఇంచార్జ్‌ని కారుతో ఢీకొట్టి పరారైన యువకుడు..
Kotamreddy Srinivasulu Reddy:నెల్లూరు జిల్లాలో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీకొట్టాడు. శ్రీనివాసులరెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ రెడ్డి తాగి కోటంరెడ్డి ఇంటికి వచ్చి గొడవ చేశాడని, సర్ధిచెప్పే క్రమంలో కారుతో ఢీకొట్టి పరారైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
- కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన సునాక్ కుమార్తె.. భారత్‌కు వెళ్లడమే ఇష్టమన్న చిన్నారి
Rishi Sunak Daughter : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నృత్య ప్రదర్శన ఇచ్చింది.
- 'అదే జరిగితే.. సొంత స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తా'.. యాపిల్, గూగుల్‌లకు మస్క్ వార్నింగ్
ఒకవేళ గూగుల్, యాపిల్లు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తానని తెలిపారు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
- చైనాలో లాక్డౌన్ నిబంధనలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రోడ్లపై నిరసన
చైనాలో సుదీర్ఘకాలంగా కరోనా ఆంక్షలు కొనసాగించటంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆంక్షలు ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఉరుంకి నగరంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది చనిపోయారు. కరోనా ఆంక్షల వల్లనే వారు తప్పించుకోలేకపోయారన్న ఆరోపణలతో అక్కడి ప్రజలు ఆంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.
- డాడీ కన్నా ముందే చిరంజీవి సినిమాలో నటించిన బన్నీ.. ఆ మూవీ తెలుసా?
పాన్ఇండియా స్టార్ అల్లుఅర్జున్.. హీరో కాక ముందు చిరంజీవి నటించిన డాడీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందే చిరు నటించిన మరో చిత్రంలోనూ బన్నీ కనిపించారు. ఆ చిత్రమేంటో తెలుసా?