- రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లతో సీఎస్ జవహర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్సు
CS JAWAHAR REDDY TELECONFERENCE: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాన్ ఎఫెక్ట్ ఉన్న ఆయా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాండౌస్ ఎఫెక్ట్.. వణికిపోతున్న నెల్లూరు
RAINS IN NELLORE : మాండౌస్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా వణికిపోతుంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ.. వైసీపీ ప్రజలను మభ్యపెడుతోంది: చంద్రబాబు
Chandrababu accuses YSRCP: తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ, మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితామని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠా అరెస్టు..
Most wanted gang arrested: పదిహేను సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా ఎట్టకేలకు దొరికింది. నాలుగు రాష్ట్రాల్లో వీరిపై 42 కేసులు ఉన్నాయి. వీరు దేశంలోని వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, నగల షాపులు, ఒంటరి వ్యక్తులు ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్.. ఆదివారమే ప్రమాణస్వీకారం
హిమాచల్‌ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రచార కమిటీకి నేతృత్వం వహించిన సుఖ్విందర్ సింగ్ సుఖు ఎన్నికయ్యారు. సీఎం రేసులో అనేక మంది ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ఆదివారం సుఖ్విందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొడుకు పెళ్లిలో రిటైర్డ్ టీచర్ ఉదారత.. స్టూడెంట్స్‌కు గిఫ్ట్‌గా రూ.10 వేల చెక్కులు..
బిహార్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. తన కుమారుడి పెళ్లికి 10 మంది విద్యార్థినిలకు రూ.10 వేల చెక్కును అందించారు. ఆ కథేంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యా వెనుక ఇరాన్'.. అమెరికా కీలక వ్యాఖ్యలు
Iran Drones Russia : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఇరాన్ పూర్తి మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. ఇప్పటికే ఇరాన్ డ్రోన్లతో మాస్కో సేనలు తమపై దాడులు చేస్తున్నాయని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్న వేళ అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా-ఇరాన్ రక్షణ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని అమెరికా వెల్లడించింది. రష్యా-ఇరాన్ మధ్య ఆయుధాల పంపిణీ అంతర్జాతీయ సమాజానికి హానికరమని అగ్రరాజ్యం విమర్శించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆరోగ్య బీమా క్లెయిం' రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ఆరోగ్య అత్యవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అనుకున్నా సరే.. కొన్నిసార్లు బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తప్పిన క్లీన్‌స్వీప్ గండం.. మూడో వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం
India vs Bangladesh Match : బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 227 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించారు. బౌలర్లు కూడా బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బుగ్గపై వేలు పెట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్. తెలుగులో దాదాపు ఐదుకుపైగా సినిమాలు చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఈమె ఆర్జీవీతో కూడా సినిమాలు చేసింది. అంతకుముందెన్నడూ రాని గుర్తింపు ఆర్జీవీ సినిమాతో ఆమెకు లభించింది. అసలు ఆ చిన్నారి ఎవరంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.