ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచటాన్ని ఏపీ విత్తనాలు, ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా కంపెనీలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ధరల పెరుగదల ద్వారా ఏపీ రైతులపై 5వేల 296కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. యూరియాతో కలిపితే ఈ భారం మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఎరువుల కంపెనీల నిర్ణయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి.. రైతులు మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందన్నారు.
ఇదీచదవండి.