ETV Bharat / state

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదు - కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీది రెండో స్థానం - ఏపీలో కోర్టు ధిక్కారం

AP Second Rank in Contempt of Court Cases: జగన్‌ ఏలుబడిలో న్యాయస్థానాలను ధిక్కరించడం సర్వసాధారణం అయిపోయింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హక్కుల కోసం విపక్ష నేతలు, బిల్లుల కోసం గుత్తేదారులు అనేక సందర్భాల్లో కోర్టులకెక్కడం న్యాయస్థానాలు రాజ్యాంగ బాధ్యతల్ని గుర్తు చేయడం, ఐనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది.

AP_Second_Rank_in_Contempt_of_Court_Cases

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 8:47 AM IST

కోర్టు ఉత్తర్వలంటే లెక్కలేదు - కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీది రెండో స్థానం

AP Second Rank in Contempt of Court Cases : కోర్టు ఉత్తర్వులు అంటేనవ్వులాటగా ఉందా? 'న్యాయస్థానంతోనే ఆటలా? ఎవరేం చేస్తారనే ధీమానా? ఎన్ని సార్లు చెప్పినా చెవికెక్కదా?' కోర్టు ధిక్కరణ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో చేసిన హెచ్చరికలివి. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచారనడానికి.. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో (Pending Cases in High Court) ఉన్న ధిక్కరణ వ్యాజ్యాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండడమే నిదర్శనం. కోర్టు ఉత్తర్వులు (Court Orders) అంటే రాష్ట్రంలోని ఉన్నతాధికారులు బొత్తిగా భయం లేకుండా వ్యవహరిస్తున్నారు.

పదే పదే కోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధపడుతున్నారు గానీ, న్యాయస్థానాల ఆదేశాలు అమలు చేయడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. కోర్టుల హుందాతనాన్ని కాపాడాలని న్యాయమూర్తులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోని పరిస్థితి. కొన్ని సందర్భాలలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తేనో,. మరికొన్ని సందర్భాల్లో అరెస్టు వారెంట్‌ (Arrest Warrant) జారీ చేస్తేనో కోర్టు ఉత్తర్వులు ఆమలు చేస్తున్నారు.

ధిక్కరణ కేసులో ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో నిలబెట్టి

Contempt of Court Cases in YSRCP Government : గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి పనులు, నీరు-చెట్టు పథకం బిల్లులను చెల్లించేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొండికేసింది. ఎంపిక చేసుకున్న కొందరికే మంజూరు చేస్తూ.. మిగిలిన వారి విషయంలో వివక్ష చూపుతోంది. హైకోర్టు జోక్యంతో కొంతమందికి ఉపశమనం లభించినా.. ప్రభుత్వం బిల్లులను చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య వేలల్లో ఉంది. జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావు వద్దే రెండు వేలకు పైగా ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి.

నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ ప్రకారం.. 2023 అక్టోబర్‌ 23 వరకూ దేశ వ్యాప్తంగా లక్షా 17 వేల 324 కోర్టు ధిక్కరణ కేసులు హైకోర్టుల్లో పెండింగ్‌ల్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అలహాబాద్‌ హైకోర్టులో 25 వేల 719 ధిక్కరణ కేసులుంటే.. రెండో స్థానంలో ఉన్న ఏపీ హైకోర్టులో 13 వేల 312 ధిక్కరణ కేసులు ఉన్నాయి.

High Court on Social Media Trolls on Judges: క్రిమినల్‌ కోర్టుధిక్కరణపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

Government Officials are Negligent of Court Orders : వైఎస్సార్సీపీ అధికాంలోకి వచ్చిన 2019 సంవత్సరంలో 1171 కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైర్టులో దాఖలవగా 2023లోనే ఇప్పటి దాకా 5 వేల 800 కంటెప్ట్ ఆఫ్‌ కోర్ట్‌ కేసులు దాఖలు అయ్యాయి. ప్రభుత్వ శాఖలపై దాఖలైన వ్యాజ్యాల పర్యవేక్షణకు..'ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (Online Legal Case Monitoring System)' పేరుతో ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను తెచ్చింది. సకాలంలో కౌంటర్ల దాఖలుకు, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఫలితం కనిపించడం లేదు. ఏటికేడు కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతుండడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరచడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.