ఈ నెల 20న "సంక్షోభంలో విద్యారంగం" అనే అంశం పై మేదో మథనం సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ ట్రెజరర్ రవీంద్రబాబు తెలిపారు. గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరుగనున్నట్లు వెల్లడించారు. సదస్సుకు సంబంధిచిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను సమస్యలకు గురి చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
రాష్ట్రంలో నూతన విద్యా విధానాలను ప్రవేశపేట్టి ప్రైవేట్ విద్యా సంస్థలను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయుల సమస్యల పై ఈ నెల 20న జరిగే సదస్సులో సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సదస్సులో మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది'