ETV Bharat / state

AP Panchayat By-Elections Results 2023: ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డా.. వైసీపీకి 22 పంచాయతీలే! - ఏపీలో సర్పంచ్​ ఉప ఎన్నికలు

AP Panchayat By-Elections Results 2023: రాష్ట్రంలో కొన్ని పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ రకరకాల కుతంత్రాలకు పాల్పడినా, విచ్చలవిడిగా డబ్బులు, బహుమతులు పంచి ఓటర్లను ప్రలోభపెట్టినా, వాలంటీర్లను ప్రయోగించి బెదిరించినా.. ఆ పార్టీ మద్దతుదారులు 22 సర్పంచి స్థానాలకే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ అనుకూలులు గెలిచిన సర్పంచి స్థానాల్లో ఏడింటిని టీడీపీ కైవసం చేసుకోగా, ఒకటి జనసేన - టీడీపీ మద్దతుదారులు ఉమ్మడిగా గెలుచుకున్నారు.

AP_Panchayat_By_Elections_Results_2023
AP_Panchayat_By_Elections_Results_2023
author img

By

Published : Aug 20, 2023, 9:57 AM IST

AP Panchayat By-Elections Results 2023: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34 సర్పంచి స్థానాలకు శనివారం పోలింగ్‌ నిర్వహించగా, వైసీపీ మద్దతుదారులు 22, ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఒకటి, టీడీపీ మద్దతుదారులు 9, టీడీపీ, జనసేన కలిపి 2 సర్పంచి స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం 243 వార్డులకు ఎన్నికలు జరగ్గా, వైసీపీ అనుకూలురు 141, తిరుగుబాటు అభ్యర్థులు 2, టీడీపీ మద్దతుదారులు 90, జనసేన మద్దతుదారులు 5, టీడీపీ, జనసేన కలసి ఒకటి, సీపీఎం ఒకటి, ఇతరులు మూడు స్థానాల చొప్పున గెలుచుకున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 1లక్షా 33వేల 777 మంది ఓటర్లకుగానూ 97వేల 010 మంది ఓటేశారు.

Pratidhwani: గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామంటున్న సీఎం జగన్ మాటల్లో నిజమెంత..?

Panchayat By-Poll Results in AP: మొత్తం 245 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, 2 వార్డుల్లో నామినేషన్లు రాకపోవడంతో ఎలక్షన్స్​ నిర్వహించలేదు. గత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచిన శ్రీకాకుళం జిల్లా బొప్పడం, అల్లూరి జిల్లా శోభకోట, అనకాపల్లి జిల్లా కొరుప్రోలు, పశ్చిమగోదావరి జిల్లా కావలిపురం, ప్రకాశం జిల్లా పాకాల, నెల్లూరు జిల్లా లింగరాజు అగ్రహారం , అనంతపురం జిల్లా జంగంపల్లిలను ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. బాపట్ల జిల్లాలోని మున్నంగివారిపాలెం పంచాయతీని జనసేన, టీడీపీ కలసి గెలుచుకున్నాయి.

Volunteers Participated in Sarpanch Election "మరీ ఇంత బరితెగింపా?"..సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్లు

Sarpanch and Ward Members By-Elections in AP: రాష్ట్రంలో కొందరు సర్పంచులు, వార్డు మెంబర్లు చనిపోవడం, కొందరు రాజీనామాలు చేయడం వంటి పలు కారణాల వల్ల 26 జిల్లాల్లో 64 సర్పంచి, 1,001 వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండున్నర సంవత్సరాలు క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అరాచకాల్ని, అక్రమాల్ని అధికార పార్టీ ఇప్పుడూ పునరావృతం చేసింది. ఆ క్రమంలో 30 సర్పంచి, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

BTech Ravi Fires on CM Jagan: ఇడుపులపాయలో సర్పంచ్​ ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్​కు లేదా..?: బీటెక్ రవి

TDP Supporters Won Panchayat By-Poll Eiections: పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ పంచాయతీలో ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకుండా.. ధ్రువపత్రాలు జారీ చేయకుండా అధికారులు తాత్సారం చేశారు. చివరకు టీడీపీ అండతో పోటీకి దిగిన పెద్దింటి లక్ష్మన్న నామినేషన్‌కు కొర్రీ వేశారు. ఓటరు జాబితాలో పేర్కొన్నట్లు కాకుండా, నామినేషన్‌ పత్రంలో పేరు తప్పుగా రాశారన్న సాకు చూపించి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు సర్పంచి స్థానానికి టీడీపీ మద్దతుతో అమ్మణ్నమ్మ వేసిన నామినేషన్‌నూ ఇలాగే తిరస్కరించారు. ఇదే విధానంలో పలుచోట్ల భయపెట్టి అధికార పార్టీ మద్దతుదారులతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంది. రకరకాల అడ్డంకులను అధిగమించి విపక్షాల అండతో అభ్యర్థులు బరిలో నిలవడంతో 34 సర్పంచి స్థానాలకు, 243 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Sarpanch Candidates Kidnapped: నామినేషన్​ వేసేందుకు వెళ్లిన అభ్యర్థుల కిడ్నాప్​.. పెనమల్లం సర్పంచ్​ ఉప ఎన్నికలో ట్విస్ట్​..

వాలంటీర్లు.. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, వాటిని బేఖాతరు చేశారు. అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల తరపున వాలంటీర్లు అనేక చోట్ల బహిరంగంగానే ప్రచారంలో పాల్గొన్నారు. దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లాల కలెక్టర్లకు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేసినా, వాలంటీర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Chandrababu on AP Panchayat By Election Results: వైసీపీని ఎదిరించి టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు: చంద్రబాబు

AP Panchayat: సర్పంచులు, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో వైసీపీకి ఝలక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.