పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... జులై 8న రికార్డుస్థాయిలో 30 లక్షల ఇళ్లస్థలాలను ఒకేసారి అందించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు చెప్పారు. గుంటూరులో గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై మంత్రులు మోపిదేవి, సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్న మంత్రి... తొలి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈలోపు పట్టాలిచ్చే స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.
ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహనిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.1,223 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నామని... అదే సమయంలో 17 వేల బోగస్ ఇళ్లను రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న ఆయన... కావాలని ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని... పార్టీ విధానాలు, చేసిన అభివృద్ధి చూసి వచ్చి చేరుతున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..