ETV Bharat / state

సీఐడీ పోలీసులది అత్యుత్సాహమే: హైకోర్టు - ap cid police news

తెలుగు వన్.కామ్ ఎండీపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అధికారుల తీరు అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తి పరచడానికి అన్నట్లుందని ఆక్షేపించింది. అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా అధికారులు పనిచేయాలని హితవు పలికింది.

ap High Court
ap High Court
author img

By

Published : Sep 12, 2020, 5:55 AM IST

'కేసు నమోదు, దర్యాప్తు చేయటం, ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో మంగళగిరి సీఐడీ ఠాణా పోలీసుల అత్యుత్యాహం చూస్తుంటే.... అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తి పరచడానికి అన్నట్లుంది. పార్టీలు అధికారంలోకి రావొచ్చు. కొంతకాలం తర్వాత అధికారం కోల్పోవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేకుండా అధికారి పనిచేయాలి. సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు ముసుగులో ప్రజల్ని వేధించడం అరాచకత్వానికి దారి తీస్తాయి. ప్రజలు ప్రజాస్వామ్యంలో(డెమోక్రసీ) కాకుండా... ఖాకీస్వామ్యంలో(ఖాకిస్టోక్రసీ) జీవిస్తున్నారనే భావనలు అధికారులు కలిగిస్తున్నారు. ఇలాంటి అధికారులు చర్యలను నియంత్రించకుంటే జీవించే హక్కు, స్వేచ్ఛ, వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగే తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి' అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. 'తెలుగువన్.కామ్' డిజిటల్ మీడియా ఎండీ కె.రవిశంకర్​పై మంగళగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసును రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని వెనక్కి ఇవ్వాలని సీఐడీని ఆదేశించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై అభ్యంతరకరంగా ఉన్న తెలుగువన్ న్యూస్ ఛానల్​కు చెందిన వార్తను యూట్యూబ్​లో చూశానని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పి. జగదీష్ అనే వ్యక్తి సీఐడీ అదను డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరి సీఐడీ ఠాణాలో ఈ ఏడాది ఏప్రిల్ 29న ఐపీసీ 188, 505(2 ), 506, విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 54 కింద తెలుగువన్ న్యూస్ ఛానల్ ఎండీ రవిశంకర్​పై కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... సీఐడీ పోలీసుల తీరును తప్పుపడుతూ ఇటీవల తీర్పు ఇచ్చారు.

ఆ సెక్షన్​ కింద కేసు ఎలా పెడతారు?

పిటిషనర్​ తరఫు న్యాయవాది ఎ.రాధాకృష్ణ వాదనలు... 'ఫిర్యాదులో సంబంధిత అంశాన్ని ప్రస్తావించకపోయినా సీఐడీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును రద్దు చేయండి' అని కోరారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనని, పిటిషన్ కొట్టేయాలని కోరారు. జీపీ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి... 'చట్టాలను ఉల్లంఘించిన వారి నుంచి ప్రజలను రక్షించడం సీఐడీ, శాంతి భద్రతల విభాగం పోలీసుల ప్రాథమిక విధి. ప్రస్తుత సందర్భంగా సీఐడీ పోలీసులు చట్ట దుర్వినియోగానికి పాల్పడి వివిధ సెక్షన్ల కింద పిటిషనర్​పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, శత్రుత్వం పెంచే అంశం ఉన్నట్లు ఫిర్యాదులోనే లేదు. యూట్యూబ్​లో పోస్టింగ్ ప్రభుత్వాన్ని, ప్రస్తుత ముఖ్యమంత్రిని అవమానపరిచేదిగా ఉన్నట్లు మాత్రమే ఆరోపించారు. అలాంటప్పుడు సెక్షన్ 505(2) కింద కేసు ఎలా నమోదు చేస్తారు? మిగిలిన సెక్షన్ల నమోదు కూడా సరికాదు. సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడి పిటిషనర్​పై కేసు నమోదు చేశారు' అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

తెలుగు నేలపై జన్మించి.. సేవా తరంగమై విహరించి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.