AP Govt Talks With Arogyasree Network Hospitals Failed: డిసెంబరు 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అధికారులు దిగి వచ్చారు. నేడు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళగిరి వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారు. చికిత్స ధరల పెంపు, పెండింగ్ బిల్లుల చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని గతంలోనే ప్రభుత్వానికి ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆరోగ్యశ్రీ నిధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే వెయ్యి కోట్ల అవినీతి : పెద్దిరెడ్డి
Private Hospitals Association Letter to Govt: గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సుమారు రూ. 1000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. పోయినసారి జరిగిన సమావేశంలో బకాయిలు మొత్తం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంతో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో డిసెంబరు 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు లేఖను డిసెంబరు 22 తేదీన ప్రభుత్వానికి అందజేశామని అసోసియేషన్ తెలిపింది. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదని తెలిపారు.
పేదల గుండెలు అల్లాడుతున్నా పట్టించుకోని జగన్-నిధులు కేటాయించని వైసీపీ ప్రభుత్వం
పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు. అంతేగాక తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా దానిని రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచిందని అంటున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదని వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద కూడా సేవలు అందించలేమని పేర్కొంది. డిమాండ్లను పరిష్కరిస్తామని గతనెలలో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలు కొనసాగించాయనీ ఇప్పుడు సానుకూల చర్యలు లేనందున వైద్య సేవలు నిలిపేయాలని నిర్ణయించామని తెలిపింది. అలాగే 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచకపోవడంపై ప్రైవేటు ఆస్పత్రులు అసంతృప్తితో ఉన్నాయి.
ప్రభుత్వ చర్చలు విఫలం - ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లో నిలచిపోయిన సేవలు
CM Jagan on Arogyasri: గతంలో సీఎం జగన్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇకపై 25 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ రాకూడదనే ఉద్దేశంతో మార్పులు తీసుకువస్తూ ముందడుగు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పడు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామనడం గమనార్హం.