ETV Bharat / state

సర్కార్ పరిధిలోకి సంగం డెయిరీ - ap govt key decession on sangam dairy

సంగం డెయిరీ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీ యాజమాన్య అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్​ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ap sangam dairy
ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ
author img

By

Published : Apr 27, 2021, 3:07 PM IST

Updated : Apr 28, 2021, 5:30 AM IST

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ) పరిధిలోకి ప్రభుత్వం తిరిగి తీసుకుంది. డెయిరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ నిర్వహణ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ... 1978 జులై 17న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నిత్యావసరాల సరఫరా, డెయిరీ ఆస్తుల రక్షణకు 3 నెలల కాలానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

‘సంగం జాగర్లమూడిలోని డెయిరీ కార్యకలాపాల బాధ్యతల్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం 1978 జులై 17న ఉత్తర్వులు(జీవో 515) జారీ చేసింది. భూములు, డెయిరీ ప్లాంట్‌, యంత్రాలపై యాజమాన్య హక్కుల్ని బదిలీ చేయలేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిని తాకట్టు పెట్టడం, ఇతరులకు స్వాధీనం చేయకూడదు. నిర్వహణ కోసం అప్పగించిన డెయిరీలో అవకతవకలు, ఆస్తుల దుర్వినియోగం జరిగిందని.. 2020 సెప్టెంబరు 11న పాల కమిషనర్‌, మిల్క్‌ కోఆపరేటివ్స్‌ రిజిస్ట్రార్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. దీనిపై విచారించాలని 2020 నవంబరు 5న అవినీతి నిరోధక శాఖ(అనిశా)ను సర్కారు కోరింది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యాజమాన్య హక్కులు ఏపీడీడీసీవే
‘డెయిరీలో అవకతవకలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ 2021 ఏప్రిల్‌ 19న అనిశా తన విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎండీ, అప్పటి సహకార అధికారితో కలిసి గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘం ఛైర్మన్‌.. డెయిరీకి చెందిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ పేరిట బదలాయించారని నివేదిక వివరించింది. డెయిరీని పాల ఉత్పత్తిదారుల సంస్థగా మార్చడంతోపాటు ప్రభుత్వ/ఏపీడీడీసీ భూములను తనఖా పెట్టి ఎన్‌డీడీబీ నుంచి మోసపూరితంగా భారీ రుణాలు పొందారని అనిశా నివేదిక వివరించింది. డెయిరీ నిర్వహణ మాత్రమే పాల ఉత్పత్తిదారుల సంఘానికి బదిలీ చేశారని.. యాజమాన్య హక్కులు ఎప్పుడూ ఏపీడీడీసీ దగ్గరే ఉన్నాయని పేర్కొంది. వీటన్నింటిపై అనిశా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది’ అని ప్రభుత్వ ఉత్తర్వు వివరించింది. ఉల్లంఘనలపై అనిశా నివేదిక మేరకు.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జీవో 515ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

డెయిరీ ఇన్‌ఛార్జి ఎండీకి ఉత్తర్వులు
పొన్నూరు, న్యూస్‌టుడే: డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించడంతో ఆయన మంగళవారం ఉదయం డెయిరీ వద్దకు వచ్చారు. ఉత్తర్వులను డెయిరీ ఇన్‌ఛార్జి ఎండీ బ్రహ్మయ్యకు అందించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇక్కడికి రావడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే.. డెయిరీని ప్రభుత్వం స్వాధీన పరచుకున్నట్టు సబ్‌కలెక్టర్‌ చెప్పారు. అనంతరం సంస్థలోని వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. సంస్థ చుట్టూ పోలీసులు నిఘాపెంచారు. లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించలేదు.

‘సంగం’ తాత్కాలిక ఛైర్మన్‌గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: సంగం డెయిరీ తాత్కాలిక ఛైర్మన్‌గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్‌ను సంస్థ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో వీరు సమావేశమయ్యారు. డెయిరీ 14 మంది సభ్యుల్లో ఒకరు కొవిడ్‌ బారిన పడటంతో 13 మంది హాజరయ్యారు. అనంతరం నర్రా వెంకటకృష్ణ ప్రసాద్‌తో కలిసి విలేకరులతో వారు మాట్లాడుతూ...
‘‘సంగం డెయిరీ కంపెనీగా ఏర్పడింది. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 19ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తాం. గతంలో డెయిరీ టర్నోవర్‌ రూ.250 కోట్లు ఉండేది. ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర బాధ్యతలు చేపట్టాక అది రూ.1100 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను ప్రోత్సహించేందుకు ‘సంగం’పై అనిశాతో దాడులు చేయించి, ఛైర్మన్‌ ధూళిపాళ్లను అక్రమంగా అరెస్టు చేయించింది. డెయిరీని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడతాం’’ అని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: 'మల్లెపువ్వు వాసన, మామిడి పండు రుచి తెలిస్తే.. కరోనా లేనట్టే'

Last Updated : Apr 28, 2021, 5:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.