ETV Bharat / state

AP Students in Manipur: మణిపుర్‌ నుంచి తెలుగు విద్యార్థుల తరలింపు.. రెండు విమానాల్లో ఏపీకి

ap government
ap government
author img

By

Published : May 7, 2023, 10:55 PM IST

Updated : May 8, 2023, 9:46 AM IST

22:47 May 07

సొంత ఖర్చుతో 2 విమానాలు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Students in Manipur: మణిపుర్‌లో ఉన్న విద్యార్థులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే సొంత ఖర్చులతో విమానం ఏర్పాటు చేసి విద్యార్థులను తీసుకురావాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం 9.35 గంటలకు ఇంఫాల్​ నుంచి హైదరాబాద్‌కు విమానం బయలుదేరనుంది. ఈ విమానంలో 108 మంది విద్యార్థులు హైదరాబాద్​ రానున్నారు. అలాగే రెండో విమానం ఉదయం 11.10 గంటలకు కోల్‌కతా బయలుదేరనుంది. ఈ విమానంలో 49 మంది విద్యార్థులు రానున్నారు. మొత్తం మణిపుర్​ నుంచి 157 మందిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది.

మణిపుర్​ నుంచి విద్యార్థుల తరలింపుకు చర్యలు: ఈ నేపథ్యంలోనే మణిపుర్‌ నుంచి తెలుగు విద్యార్థుల తరలింపునకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏపీ భవన్​ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 157 మంది ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఒక విమానం హైదరాబాద్‌, మరో విమానం కోల్‌కతాకు తరలిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మొత్తం 160 మంది విద్యార్థుల వివరాలు సేకరించినట్లు ఏపీ భవన్‌ వెల్లడించింది.

Botsa Respond on Manipur Issue : మణిపూర్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మణిపూర్​లో 150 మంది ఏపీ విద్యార్థులు ఉన్నట్లు అంచనా ఉందన్న బొత్స.. ఇప్పటికే వంద మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించామని వెల్లడించారు. పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌లు.. హిమాన్షు కౌశిక్‌, కమిషనర్‌, ఏపీ భవన్‌, కాంటాక్ట్‌ నంబర్‌ 88009 25668, రవిశంకర్‌, ఓఎస్‌డీ, ఏపీ భవన్‌, కాంటాక్ట్‌ నంబర్‌ 91871 99905 నియమించినట్లు మంత్రి తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిట్, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు టచ్​లో ఉన్నారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి స్టూడెంట్స్ లిస్ట్ ఔట్ చేశామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి బొత్స తెలిపారు.

సివిల్ ఏవియేషన్ మినిష్టర్​తో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు.. వివరాలు నమోదు చేసుకుంటే తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందకండి అని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు సుమారు 100 వరకు విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇంకా 50 మంది వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నామని చెప్తూ.. 150 మందికి సరిపడా విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

పరిస్థితులు అదుపులోకి.. మణిపూర్​లో ఘర్షణ వాతావరణం క్రమంగా చల్లారుతోంది. మైతీ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు స్థానిక గిరిజన జాతులు వ్యతిరేకించడం వల్ల చెలరేగిన హింస ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించడం వల్ల ప్రజలు రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో సైన్యం పటిష్ఠ నిఘా చర్యలు చేపట్టింది. గత కొద్దిరోజులుగా అట్టుడుకుతున్న మణిపూర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. దీంతో మణిపూర్ లోని కొన్నిప్రాంతాల్లో ఆంక్షలు సడలించారు. కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన చురచంద్‌పూర్‌ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 8, 2023, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.