ETV Bharat / state

రేషన్ కార్డులను... పునరుద్ధరించుకోండిలా... - ధ్రువీకరణ పత్రాలు

వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేలో భాగంగా గుంటూరు జిల్లాలో రద్దైన బియ్యం కార్డులను... పునరుద్ధరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అనర్హత సవాలు చేస్తూ పున: పరిశీలనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవి సమర్పించాలి. ఎక్కడ అందజేయాలో వివరాలు వెల్లడించింది.

బియ్యం కార్డు... పునరుద్ధరించుకోండిలా...
recheck cancelled ration cards in Guntur district
author img

By

Published : Dec 19, 2020, 12:46 PM IST

వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేతో పాటు వీఆర్‌ఓలు.. పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు నిర్వహించిన విచారణలో భాగంగా రేషన్ కార్డులను రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో 1,00,423 కార్డుల్ని అనర్హత జాబితాలో చేర్చి ఈ నెలలో సరకులు నిలుపుదల చేశారు. అనర్హత పున: పరిశీలనకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆయా అంశాల్లో అనర్హత సవాలు చేస్తూ సంబంధింత ధ్రువీకరణ పత్రాల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయడం ద్వారా కార్డుల్ని పునరుద్ధరించుకోవచ్ఛు.

  • ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే ఛార్డెడ్‌ అకౌంటెంట్‌(సీఏ) ప్రాక్టీషనర్‌ నుంచి ఫారం-16 తీసుకుని సమర్పిస్తే కార్డు పునరుద్ధరిస్తారు.
  • 300 యూనిట్లకంటే తక్కువ విద్యుత్తు వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు రద్దు చేస్తే విద్యుత్తుశాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పిస్తే కార్డు రద్దవ్వదు.
  • నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీవో, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పర్యవేక్షకాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
  • పదెకరాలకంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే తహసీల్దార్‌ నుంచి 1బీ ధ్రువపత్రం తీసుకోవాలని డీఎస్‌ఓ పద్మశ్రీ పేర్కొన్నారు.
    గుంటూరు మున్సిపాల్టీ అయ్యింది ఎప్పుడంటే..?

గుంటూరు మున్సిపాల్టీగా 1866లో ఆవిర్భవించింది. మొదటి మున్సిపల్‌ ఛైర్మన్‌గా సిగరవేలు మొదలియార్‌ వ్యవహరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6,70,073గా ఉంది. ఇదే జిల్లాలోని స్థానిక సంస్థల్లో అత్యధిక జనాభాగా ఉంది.

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు కుమారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.