గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుభాని నగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా... ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను అతి తక్కువ సమయంలో పేర్చటంలో ఫజీలా ఈ రికార్డు సాధించింది.
కేవలం ఒక నిముషం 43 సెకన్లలో ఆమె పేర్చి.. 2 నిముషాల 29 సెకన్లతో ఉన్న పాకిస్థాన్ బాలిక రికార్డును ఫజీలా అధిగమించింది. ఫజీలా తండ్రి రహీం పెదనందీపాడులోని ప్రభుత్వ ఉర్దూ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణిగా ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కావటంతో తండ్రి తెలిపిన విషయాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. రసాయన శాస్త్రంపై ఆసక్తి ఉండటంతో గిన్నిస్ రికార్డును సాధించింది.
ఇదీ చదవండి: