ETV Bharat / state

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం: ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - ఏపీ ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

AP Finance: రాష్ట్రం ఎన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా..ప్రతి నెలా 5వ తేదీ జీతాలు పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోందని ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ తెలిపారు.

AP finance
ఏపీ ఆర్థికశాఖ
author img

By

Published : Jan 22, 2023, 12:31 PM IST

AP Finance: ‘రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్‌ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలం’ అని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉద్యోగుల జీతాలు, పింఛను బిల్లులు 90-95% వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్‌ చేస్తారని, వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5లోగా పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్‌ అండ్‌ మీన్స్‌- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకుముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.