'తెదేపా నాయకుల దందాలతోనే ఇసుక కొరత' - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి గతంలో 10 వేల కోట్లు పక్కదారి పట్టించిన తెలుగుదేశం... ఇప్పుడు వారి సంక్షేమం కోసం దీక్షలు చేయడం విడ్డూరమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సొమ్మును అప్పట్లో ఫ్లెక్సీల వంటి అనవసర ఖర్చులకు వినియోగించారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో తెదేపా నాయకుల దందాలతోనే ఇసుక కొరత ఏర్పాడిందన్నారు.