ETV Bharat / state

AP Cabinet Meeting Decisions: మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అవి ఏంటంటే - ap ministers meeting

AP Cabinet Meeting: సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో.. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని ఆర్​-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అసైన్డ్ భూములపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగిన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన ప్రాజెక్టులకు కేబినెట్‌ పచ్చజెండా ఊపినట్లు మంత్రి వేణుగోపాల్‌కృష్ణ తెలిపారు. కేబినెట్‌ అనంతరం ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చెప్పినట్లు తెలిపారు.

AP Cabinet Meeting Decisions
AP Cabinet Meeting Decisions
author img

By

Published : Jul 12, 2023, 3:39 PM IST

Updated : Jul 12, 2023, 8:59 PM IST

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting: నాలుగు గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏలోని ఆర్​-5 జోన్ లో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదించింది. జూలై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టంచేశారు. ఈ నెల 18న జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదించిందన్నారు. సీఅర్డీఏ పరిధిలోని ఇళ్ల నిర్మాణం కోసం జులై 24న పనులు ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. సున్నా వడ్డీ కింద 1350 కోట్లు, జగనన్న విదేశీ విద్య తదితర పథకాల అమలుకు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినున్నట్లు మంత్రి వివరించారు.

భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ భూమిపై ఆంక్షలు తొలగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 54 వేల ఎకరాల అసైన్డ్ భూములు, 9 వేల 62 ఎకరాల లంక భూములు రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. 20 ఏళ్లుగా హక్కులు లేని అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ నిర్ణయించిన్నట్లు తెలిపారు. 1700 రెవెన్యూ గ్రామాల్లో 1050 ఎకరాల భూమి నీ శ్మశాన వాటికలకు ఇవ్వాలనీ నిర్ణయించామని, ఈ కేబినెట్ దళిత వర్గాలకు వరాలు కురిపించిందని మంత్రి తెలిపారు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు తెలిపారు. 22ఏలో ఉన్న ఇనాం భూములకు విషయంలోనూ హక్కులు కల్పించేందుకు కేబినెట్ ఆమోదించిందన్నట్లు మంత్రి తెలిపారు. విశ్వ విద్యాలయాల్లో బోధనా సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు 63 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదించిందని మంత్రి వివరించారు.

ఏపీలోని కొత్త 5 మెడికల్ కళాశాల ల్లో 706 పోస్టులు, బోధనా కోసం 480 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అన్నమయ్య జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు 482 కోట్లు ఆమోదించిందని, పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు పోస్టుల భర్తీకి నిర్ణయించిన్నట్లు మంత్రి తెలిపారు. 8104 కోట్ల పెట్టుబడితో జిందాల్ న్యూ ఎనర్జీ ప్లాంట్ 1500 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందన్న మంత్రి.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించిందని తెలిపారు. మూలపేట పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ. 3884 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతి లభించిందని వివరించారు. ప్రభుత్వ అధీనంలోని దేవాలయాల్లో ఆర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా చట్ట సవరణ కు మంత్రి మండలి ఆమోదించిందని, కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాల్లో 13 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల భర్తీకి నిర్ణయించిందన్నారు. విశాఖలో భూముల కుంభకోణంపై సిట్ నివేదికకు ఆమోదం తెలిపారు. మరోమారు ఈ వ్యవహారంపై విచారణకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వివరించారు. మొత్తం 87 కేసుల్లో 43 కేసుల్లో విచారణ అయ్యిందని, మరో 18 కేసుల్లో మరోసారి విచారణ చేయించాలని నిర్ణయించిన్నట్లు స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని కేబినెట్ ముగిశాక సీఎం చెప్పారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. జగనన్న సురక్ష , గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పారన్నారు.

Last Updated : Jul 12, 2023, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.