ETV Bharat / state

సీఎం జగన్​కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు - అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

Anganwadi Workers Agitation 12th Day in AP: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు పన్నెండో రోజూ కదం తొక్కారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదే లేదంటూ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని వైకాపా సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆటంకాలు ఎదురైనా, డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

anganwadi_workers_agitation_12th_day_in_AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 10:13 PM IST

Anganwadi Workers Agitation 12th Day in AP: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె పన్నెండో రోజూ సాగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆకులు తిని బతకాలా ముఖ్యమంత్రి అంటూ నోటిలో ఆకులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో అంగన్వాడీలు భారీ మానవహారంగా ఏర్పడ్డారు. కనీస వేతనాలు మంజూరు చేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉద్యోగ విరమణ అనంతరం పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. యాప్​ల మోతతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం అధికంగా ఇస్తానన్న సీఎం జగన్ మాటతప్పారని అంగన్వాడీలు మండిపడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీవో కార్యాలయం ఎదుట గరిటెలతో కంచాలను కొడుతూ నిరసన తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద 12 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లేట్లపై గంటలు కొడుతూ నిరసన తెలిపారు

సమస్యలతో సతమతమవుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు - పట్టించుకోని జగన్‌ సర్కారు

కర్నూలు జిల్లాలో అంగన్వాడీల సమ్మె పన్నెండో రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా కర్నూలులో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపబోమని హెచ్చరించారు. జగన్ సర్కారుకు తాము చేస్తున్న సమ్మె కనిపించటం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నంద్యాలలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పన్నెండో రోజు కోనసాగుతోంది. సమ్మెలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపాన ప్రధాన రహదారిపై ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. పన్నెండు రోజులైనా ప్రభుత్వం స్పందించిక పోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలని అంగన్వాడీలు హెచ్చరించారు. ఏమైనా సరే భయపడేది లేదని, ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మె విరమించమని తేల్చి చెప్పారు.

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

ప్రభుత్వానికి తమ ఆందోళన వినిపించలేదేమోనంటూ అనంతపురం జిల్లా గుత్తిలో చెవులు మూసుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తమ సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ సమ్మెను మరింత తీవ్రతరం చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ICDS ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోవిందా గోవిందా అంటూ రెండు చేతులు పైకెత్తి దణ్ణం పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చెవిలో పువ్వులు పెట్టుకుని ఆందోళన చేశారు. అంగన్వాడీలు సమస్యలు పరిష్కారించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కి విజయనగరంలో పోస్టు కార్డులు రాశారు.

ఆగని అంగన్వాడీల పోరు - ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మె విరమించేదేలే

Anganwadi Workers Agitation 12th Day in AP: 'సీఎం జగన్​కు కనపడదా, వినపడదా' - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.