ETV Bharat / state

గ్రామస్థులు దాడి చేశారంటూ.. అంగన్వాడీ టీచర్ ఫిర్యాదు - ఒప్పిచర్ల అంగన్వాడీ టీచర్ వార్తలు

గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో గ్రామస్థులు దాడి చేశారంటూ అంగన్వాడీ టీచర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేస్తున్నారు.

anganwadi teacher complaint on villagers at oppicharla in guntur district
గ్రామస్థులు దాడి చేశారంటూ.. అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుగ్రామస్థులు దాడి చేశారంటూ.. అంగన్వాడీ టీచర్ ఫిర్యాదు
author img

By

Published : May 19, 2020, 3:32 PM IST

గ్రామస్థులు దాడి చేశారని అంగన్వాడీ టీచర్ పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన మంగమ్మ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ.. కిరాణా దుకాణం నడుపుతోంది. ఆ దుకాణంలో సరకులు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ స్థానికులు ఆరోపించారు.

ఈ విషయమై మంగమ్మకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు సంతకాల సేకరణ చేపట్టారు. ఆగ్రహించిన మంగమ్మ కుటుంబసభ్యులు వారితో గొడవకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మంగమ్మను తోసివేశారు. ఈ ఘటనపై ఆమె కారంపూడి స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్​బుక్​లో పోస్ట్​.. వృద్ధురాలికి అరెస్ట్​ నోటీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.