ETV Bharat / state

Andhra Pradesh Debts: అప్పుల్లో తగ్గేదేలే అంటున్న జగన్ సర్కార్..! ఐనా పెండింగులో రూ.1300 కోట్ల జీతాలు.. - ఏపీ ఆర్థిక పరిస్థితి లేటెస్ట్ న్యూస్

Andhra Pradesh Debts: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఎడాపెడా అప్పులు తెస్తున్నా.. ఉద్యోగులు, టీచర్ల జీతాలకూ తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికీ రమారమి 13 వందల కోట్ల రూపాయల మేర జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయాన్ని ఉపయోగించుకున్న ప్రభుత్వం.. దాన్ని చెల్లించలేదు. మళ్లీ రుణం సమీకరిస్తేగానీ.. జీతాలు పూర్తిగా చెల్లించలేని పరిస్థితి.

Andhra_Pradesh_Debts
Andhra_Pradesh_Debts
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2023, 1:21 PM IST

Andhra Pradesh Debts: వేల కోట్ల అప్పులు చేస్తున్నా.. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపునకు వైసీపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇతర డిమాండ్ల మాట దేవుడెరుగు.. ఒకటో తేదీనే జీతాలివ్వండి మహాప్రభో అని ఉద్యోగులు డిమాండు చేయాల్సిన దుస్థితి దాపురించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు నెలలు తప్ప.. జీతాలు, పింఛన్లు సకాలంలో అందలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇది పెద్ద సమస్యగా మారింది.

AP Debts 2023: అప్పు చేయడంలో తగ్గేదేలే!.. అంటున్న జగన్‌ సర్కార్

AP Using Over Draft Convenience: ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అప్పు చేస్తుందా.. ఆ డబ్బులు ఖజానాకు ఎప్పుడు చేరతాయా.. వాటితో జీతాలు ఇస్తారా..లేదా.. రిజర్వుబ్యాంకు ఓడీ కింద జమ చేసుకుంటుందా అని సామాన్య ఉద్యోగి కూడా చర్చించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సెప్టెంబరు 8దాటినా ఇంకా చాలా మందికి ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు పడలేదు. ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణం. సెప్టెంబరు నెల ప్రారంభం నాటికే ఏపీ ఓవర్‌ డ్రాఫ్ట్‌లో ఉంది.

GV RAO INTERVIEW: 'అప్పుల ఊబిలో ఏపీ.. మేల్కోకపోతే పెను ఉపద్రవం తప్పదు'

AP Debts 2023: సామాజిక పింఛన్లు, ఇతరత్రా కొంతమేర జీతాలు చెల్లించేసరికే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వచ్చేసింది. ప్రభుత్వ ఖజానాలో.. సొంత నిధులు లేకపోతే రిజర్వుబ్యాంకు రాష్ట్రానికి కొంత కాలానికి కొన్ని వెసులు బాటు ఇస్తుంది. ఆ వెసులుబాటు కింద తొలుత ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. ఖజానాలో నిధులు లేకపోయినా ఆ పరిధి మేరకు చెల్లింపులు చేసుకోవచ్చు. అది వాడుకున్న తర్వాత ఓవర్‌ డ్రాఫ్టు కింద 2వేల 250 కోట్ల వరకు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

Andhra Pradesh Govt Debts: అదంతా ఒక రకంగా అప్పు తీసుకున్నట్లే. నిర్దిష్ట నిబంధనల మేరకు ఆ అప్పులకూ వడ్డీలు చెల్లించాలి. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నుంచి వరుసగా 5 రోజులు దాటి ఉండకూడదు. సెప్టెంబరులో తొలి 5 రోజులూ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్‌ డ్రాఫ్ట్‌పైనే ఆధారపడి నెట్టుకొచ్చింది. సెప్టెంబరు 5న రిజర్వుబ్యాంకు నుంచి తాఖీదు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఓడీలో 5 రోజులు అయిపోయిందని.. వెంటనే బయటకు రావాలని తాఖీదు పంపింది. తొలి వారంలో సెప్టెంబరు 5న ప్రభుత్వం 3 వేలకోట్ల రూపాయల బహిరంగ మార్కెట్‌ రుణం సమీకరించింది.

అప్పులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?: టీడీపీ

Employees Salaries Delay in AP: ఆ రుణం అందినా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించలేకపోయింది. వచ్చిన రుణాన్ని రిజర్వుబ్యాంకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద జమచేసుకుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర పింఛన్లు, జీతాలను.. 7, 8 తేదీల్లో చెల్లించింది. ఉద్యోగుల జీతాల కోసం రూ.3వేల 700 కోట్లు, పింఛన్లకు రూ.17 వందల కోట్లు ప్రతి నెలా అవసరమవుతాయి. సెప్టెంబర్ 8 దాటినా ఇప్పటికీ దాదాపు 1,300 కోట్ల రూపాయల వరకు జీతాలు, పింఛన్లు ఇవ్వాలి.

AP Govt Debts: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర ఓడీలో ఉన్నట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు, పింఛనుదారులు తమకు ఆగస్టు నెల జీతాలు ఎప్పుడు అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 2 వేల కోట్ల రూపాయల రుణం సమీకరించబోతోంది. ఆ సొమ్ములు వచ్చేసరికి కూడా ఓడీకి జమచేసే పరిస్థితులు ఉండేలా కనిపిస్తున్నాయి.

'ఏ రాష్ట్రం చేయనంత అప్పు 5 నెలల్లో ఏపీ చేసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.