ETV Bharat / state

వృద్ధుడు మృతి.. కొవిడ్​ టీకానా? అనారోగ్య సమస్యలా? - death news in macherla news

కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్నాక.. ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.

covid
కొవిడ్
author img

By

Published : Apr 16, 2021, 11:07 AM IST

కరోనా నివారణ కోసం టీకా వేయించుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. పట్టణంలోని ఆజాద్​నగర్​కు చెందిన షేక్ సైదా(70) బుధవారం కొవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. ఆ రోజు రాత్రి గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది... జిల్లా అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తికి బీపీ, పెరాలసిస్​ వంటి అనారోగ్య సమస్యలున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వైద్యురాలు శివలీలా తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక విచారణ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా భయంతో వృద్ధ దంపతుల బలవన్మరణం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.