రాజధానిలోని నీరుకొండ సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుల నుంచి అమరావతి పేరును యాజమాన్యం తొలగించింది. నిన్నా.. మెున్నటిదాకా వాహనాలపైన, ఇతర పత్రాల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఏపీ, అమరావతి అనే చిరునామా ఉండేది. ఇప్పుడు ఆ పేరును తొలగించారు. ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే కనిపిస్తోంది. రాష్ట్రం మెుత్తానికి సంబంధించిన విశ్వవిద్యాలయంగా ఉండాలనే భావనతో మార్చినట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: తుళ్లూరులో ఓ వర్శిటీ బస్సు అద్దాలు ధ్వంసం