రాజధాని సమస్యలపై అమరావతి రైతులు తనను కలవలేదన్న తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను ఐకాస నేతలు ఖండించారు. గతేడాది జనవరి 20న రాజధాని రైతులు గుంటూరులోని శ్రీదేవి కార్యాలయంలో కలిశామని స్పష్టం చేశారు. రాజధానిగా ఈ ప్రాంతమే ఉండాలని, అంతా కలిసి పనిచేయాలని శ్రీదేవి సూచించారని రైతులు గుర్తుచేశారు.
తుళ్ళూరులో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారని... ఆ తర్వాత కొన్నాళ్లకు ముఖం చాటేశారని రైతులు చెప్పారు. ఇప్పటికే రాజధాని సమస్యపై రెండుసార్లు మట్లాడామని కూడా రైతులు తెలిపారు. అయినప్పటికీ శాసనసభ్యురాలు అబద్దాలు చెబుతున్నారని.. ఇది తగదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: