ETV Bharat / state

అంబటి అక్రమ మైనింగ్ కేసు.. అధికారుల క్షేత్ర పర్యటన - guntur district latest news

అక్రమ మైనింగ్ వ్యవహారం హైకోర్టుకు చేరటంతో గుంటూరు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజుపాలెం మండలం కొండమోటు ప్రాంతంలో పర్యటించిన అధికారులు... తవ్వకాలు జరిగిన తీరుని పరిశీలించారు. అక్రమాలపై నివేదిక సిద్ధం చేయనున్నారు. గనుల అక్రమాలపై నిజనిర్ధారణ కోసం వెళ్తున్న తెదేపా బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

Ambati illegal mining case .. Officers' field visit ..!
అంబటి అక్రమ మైనింగ్ కేసు.. అధికారుల క్షేత్ర పర్యటన..!
author img

By

Published : Aug 28, 2020, 7:33 PM IST

అంబటి అక్రమ మైనింగ్ కేసు.. అధికారుల క్షేత్ర పర్యటన..!

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోటు ప్రాంతంలో ముగ్గురాయి తవ్వకాలపై గనుల శాఖ అధికారులు దృష్టి సారించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని వైకాపా నేతలే కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అక్కడి తవ్వకాలపై నివేదిక కోరింది. గనుల శాఖ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గనుల శాఖ ఉప సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరావు, ఇతర అధికారులు కొండమోడు వచ్చారు. తవ్వకాలు జరిగిన తీరుని పరిశీలించారు.

అధికారులు వచ్చిన సమయంలో అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగటం లేదు. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో నీరు చేరింది. అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకుని మైనింగ్ చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. అవి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరిగాయని సమీక్షించారు. ఏ మేరకు మైనింగ్ చేశారనే అంశాలపై ఆరా తీశారు. అక్రమ మైనింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మైనింగ్ ప్రాంతానికి వెళ్లే దారిలో చెక్​పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ నిత్యం ఒక అధికారి ఉండి తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించలేదు. సొంత పార్టీ నేతల ఆరోపణలకు బదులు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముగ్గురాయి అక్రమ తవ్వకాల వ్యవహారంపై తెదేపాతో పాటు వామపక్షాల వారు క్షేత్ర పర్యటనకు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద కొందరిని, రాజుపాలెం వద్ద మరికొందరిని అరెస్టు చేసి సత్తెనపల్లి, రాజుపాలెం స్టేషన్​లకు తరలించారు.

పోలీసులు తీరుపై అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్​ను అడ్డుకోవడం చేతగాని పోలీసులు... పరిశీలనకు వెళ్లే తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ ఎలాంటి అక్రమాలు జరక్కపోతే భయం ఎందుకున్నారు. మొత్తానికి అక్రమ మైనింగ్ వ్యవహారంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి ఇబ్బందికరంగా మారింది. ఇటు సొంతపార్టీ వాళ్లకు, అటు విపక్షాలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండీ... 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.