మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరులో అమరావతి దళిత ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలతో కొవిడ్ కేసులు పెరుగుతాయని ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల వల్ల లాక్డౌన్ ఫలితాలను బూడిదలో పోసిన పన్నీరులా తయారవుతుందని ఆవేదన చెందారు. గ్రీన్జోన్లో సురక్షితంగా ఉన్న ప్రజలు... ప్రభుత్వ చర్యల వల్ల కరోనా కేసులు పెరిగి రెడ్జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.