పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షలు 278వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గ్రామాల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. రాయపూడి పుష్కరఘాట్లో రైతులు జలదీక్ష నిర్వహించారు. వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెంలో మహిళలు గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన తెలిపారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాల వద్ద మహిళలు, రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇవీ చదవండి..