ETV Bharat / state

పోరాటం @ 400వ రోజు.. 'అమరావతి' పోరు ఆగదన్న రైతులు - అమరావతి ర్యాలీ వార్తలు

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ.. అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నదాతల పోరాటం 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చేపట్టిన అమరావతి సంకల్ఫ ర్యాలీ మందడంలో ఘనంగా ముగిసింది.

amaravathi
అమరావతి అన్నదాతల ర్యాలీ
author img

By

Published : Jan 20, 2021, 12:06 PM IST

Updated : Jan 20, 2021, 4:50 PM IST

పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు రాజధాని గ్రామాల్లో చేపట్టిన అమరావతి సంకల్ప ర్యాలీ ఘనంగా ముగిసింది. తుళ్లూరులో ఉదయం ప్రారంభమైన ర్యాలీ రాజధాని పరిధిలోని పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం మీదుగా మందడం వరకు సాగింది.

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ రామకృష్ణ ఇతర నేతలు ఈ ర్యాలీలో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. అమరావతి నుంచి రాజధాని తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిందని... వాటన్నింటినీ అధిగమించి రాజధాని కోసం పోరాడుతున్నట్లు రైతులు తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రభుత్వం నిన్నటివరకూ చెప్పిన మాటలు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసత్యమని తేలిందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అన్నారు. హైకోర్టును ఇక్కడ నుంచి కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

400వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమబావుటా

Last Updated : Jan 20, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.