రాజధాని అమరావతిలో పనులు నిలిచిపోవడంతో కోట్ల విలువైన సామగ్రి దొంగల పాలవుతోంది. అధికారులు, పోలీసుల పర్యవేక్షణ లేనందున చోరులు ఆడింది ఆటగా సాగుతోంది. తుళ్లూరు మండలం వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రహదారి పక్కన విద్యుత్ హైటెన్షన్ టవర్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దీంతో దొంగలు తమ చేతులకు పని చెప్పారు. సుమారు లక్షల రూపాయల ఇనుము, టవర్‌కు వినియోగించే పరికరాలను.. గ్యాస్ కట్టర్లతో కత్తిరించి దొంగిలిస్తున్నారు.
టవర్ నిర్మాణానికి పొలం ఇచ్చిన రైతులు ఈ విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లక్షల విలువైన ఇనుము, స్థంబాలను చోరులు రాత్రివేళల్లో ఎత్తుకెళ్తున్నారు. బందోబస్తు ఎక్కువగా ఉండే సీడ్ యాక్సిస్ రహదారి పక్కనే ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం