ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం కూడా కొనసాగాయి. తుళ్లూరులో దీక్షా శిబిరం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్నా... ప్రభుత్వం తమ ఆకాంక్షను గుర్తించకపోవటంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం తమవైపే ఉందని, అంతిమ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
పెదపరిమిలో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని వీధుల గుండా సాగింది. ఈ ర్యాలీలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి కారణాంగానే తాము రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను అంగీకరించేవరకు పోరాటం సాగిస్తామన్నారు. గురువారం జరిగే బహిరంగ సభకు అమరావతి రైతులు, మహిళలు సిద్ధమవుతున్నారు.
ఇదీచదవండి.