భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాజధానిలో రైతులు ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి అంబేడ్కర్ విగ్రహంతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం విగ్రహానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే రాజధానిని రక్షిస్తోందని రైతులు చెప్పారు.
ఆ మహనీయుని స్ఫూర్తితో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా సాధిస్తామని.. రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. మిగిలిన రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లోనూ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు.
ఇదీ చదవండి: