అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 96వ రోజుకు చేరుకున్నాయి. కరోనా ప్రభావంతో దీక్షా శిబిరాల్లో 3అడుగుల దూరం పాటిస్తూ రైతులు నిరసనలు తెలిపారు. మందడం,తుళ్లూరు, వెలగపూడిల్లో జనతా కర్ఫ్యూ ప్రారంభానికి ముందు శిబిరాల్లో ధర్నా నిర్వహించారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ధర్నాలు చేశారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగాయి. జనతా కర్ఫ్యూ సమయం ప్రారంభమయ్యాక ఇంటి నుంచే రైతులు నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరు: జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనాలు