రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నదాతలకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా నాయకులు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిని ఇక్కడే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట....అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి: