ETV Bharat / state

బిల్లులు తిరస్కరించాలని అఖిలపక్షం, ఐకాస విజ్ఞాపన దీక్షలు - గవర్నర్ వద్దకు సీఆర్డీఏ మూడు రాజధానుల బిల్లులు

గవర్నర్ వద్దకు పంపిన సీఆర్డీఏ, పాలన వికేంద్రీకరణ బిల్లులను తిరస్కరించాలని అఖిలపక్ష పార్టీలు, అమరావతి ఐకాస నాయకులు కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బిల్లులకు నిరసనగా విజ్ఞాపన దీక్షలు నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గాని, పరిపాలన వికేంద్రీకరణ కాదని తెదేపా అభిప్రాయపడింది. స్వయాన ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారని సీపీఐ నేతలు ప్రశ్నించారు.

బిల్లులు తిరస్కరించాలని అఖిలపక్షం, ఐకాస విజ్ఞాపన దీక్షలు

author img

By

Published : Jul 21, 2020, 5:59 PM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. గవర్నర్ కి పంపిన సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను తిరస్కరించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు, అమరావతి ఐకాస ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్షలు నిర్వహించారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది కాని.. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. వైకాపా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తుందని విమర్శించారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని ఆరోపించారు.

పోరాటం ఆగదు

సెలెక్ట్ కమిటీలో ఉన్న రెండు బిల్లులను గవర్నర్ కి పంపడం వెనుక ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారంలోనూ వైకాపా అడ్డుగోలుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని.. రెండు బిల్లులు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆలపాటి హెచ్చరించారు. సీపీఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాజధాని మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. స్వయాన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలన్నారు. గవర్నర్ ఆమోదానికి వెళ్లిన రెండు బిల్లులను తక్షణమే తిరస్కరించాలని అయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ తీరు దారుణం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు ఉద్యమాలు చేస్తున్నా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని తెదేపా నాయకులు మన్నవ సుబ్బారావు అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.