నిజాంపట్నం హార్బర్లోని బోట్లు అన్ని జెట్టికి చేరుకున్నాయి. నేటి నుంచి రెండు నెలలపాటు సముద్ర తీరంలో చేపలవేట నిషేధం అమలుకానుంది. ఈ సమయంలో వేటకు వెళ్లరాదని.. ఎవరైనా వెళ్లితే చట్ట పరమైన చర్యలు ఉంటాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వేసవిలో సముద్ర జీవులు పునరుత్పత్తి దశలో ఉంటాయి. చేపలు, రొయ్యల సంతానోత్పత్తిని సంరక్షించేందుకు ప్రభుత్వం ఏటా రెండు నెలలపాటు వేటను నిషేధిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిలిపివేస్తారు. ఈ రెండు నెలల విరామ సమయంలో మత్స్యకారులు తమ బోట్లు, వలలను మరమ్మత్తులు చేస్తూ.. వేట సమయానికి అన్ని సిద్ధం చేసుకుంటారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం