ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యలు జగన్ పాలనకు అద్దంపడుతున్నాయని తెదేపా నేత ఆలపాటి రాజా విమర్శించారు. అమరావతి తమ ప్రాధాన్యత కాదని బుగ్గన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థికమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడితే... రాష్ట్ర భవిష్యత్తు ఏంటిని నిలదీశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ హింస వారి ప్రాధాన్యంలా కనిపిస్తోందన్నారు.
రాజధాని అమరావతిని అడుగడుగునా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని... రైతుల త్యాగాలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదని ధ్వజమెత్తారు. పీపీఏల విషయంలో సర్కారు వైఖరి ఆందోళనకు గురిచేస్తోందని... కేంద్రం చెప్పినా పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఇదీ చదవండి