చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలకు పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ లో 52 ఎకరాల్లో 6,512 నివాసాలు గతంలో మంజూరు అయ్యాయి. మొదటి దశలో 4,512 నివాసాలకు అర్హులను నిర్ణయించి, రెండో దశలో మరో 1500 మంది వద్ద నుండి 500, 50వేలు, లక్ష రూపాయలను డిపాజిట్ గా తీసుకుని లబ్ధిదారులకు సముదాయాల్లో ప్లాట్ లను కేటాయించారని అఖిలపక్ష నాయకులు తెలిపారు.
1100 మందికి బ్యాంకులో రుణ మంజూరు ప్రక్రియ పూర్తైందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ పీఎంఏవై లబ్ధిదారులు ఎవ్వరు ప్రభుత్వానికి గృహాలకు సంబంధించి డబ్బులు కట్టవలసిన అవసరం లేదని తెలిపారని అఖిలపక్ష నేతలు గుర్తుచేశారు. అయితే ఇటీవల కొత్త లబ్ధిదారుల జాబితాలను పురపాలక సంఘం ప్రకటించటంతో.. గతంలో ఇళ్ళు కేటాయించిన వారు సుమారు 1,800 మంది పేర్లు ప్రస్తుత జాబితాలో లేకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తే తాము న్యాయ పోరాటం చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు పురపాలక కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్