గుంటూరు జిల్లా కాకుమానులో ఫెర్టిలైజర్, ఎరువుల దుకాణాలు, సొసైటీలను వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎరువుల బస్తాల నిల్వలు, వాటి ధరులు... తయారీ తేదీలు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలని, ఈ-పోస్ యంత్రం ద్వారా మాత్రమే ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు.
ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇవ్వాలని వ్యవసాయ శాఖ డీడీఏ మాధవీలత స్పష్టం చేశారు. అంతకన్నా ఎక్కువ బస్తాలు అమ్మినా... ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధికంగా విక్రయించినా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఇదీ చదవండి: