ETV Bharat / state

ఎమ్మెల్యే ఆర్కే పొలంలో 'నకిలీ విత్తనాలు'.. పరిశీలించిన అధికారులు - agriculter officers visits mla alla ramakrishna reddy farm

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి తన పొలంలో వేసిన వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. పంటలో నకిలీ విత్తనాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు ఇచ్చారు. స్పందించిన అధికార యంత్రాంగం... పంటను పరిశీలించి విత్తనాలను ప్రయోగశాలకు పంపారు.

rk mla
rk mla
author img

By

Published : Oct 27, 2020, 5:57 PM IST

అధికార పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలంలోని వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. ఫిరంగిపురం మండలం వేమవరంలో తనకు చెందిన 13 ఎకరాల్లో వరి పంటను ఆళ్ల సాగు చేశారు. అందులోని 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే... అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అధికారులు పంటను పరిశీలించారు. ఐదు ఎకరాల పొలంలో అక్కడకక్కడ కేళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విత్తన నాణ్యతను తెలుసుకునేందుకు ప్రయోగశాలకు పంపించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్​పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.