ETV Bharat / state

Acharya Nagarjuna: నిబంధనలకు నీళ్లొదిలి.. మూల్యాంకన కేంద్రంలోనే వేడుకలు

Acharya Nagarjuna University: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని మూల్యాంకన కేంద్రంలో వర్సిటీ సిబ్బంది మరోసారి నిబంధనలకు నీళ్లొదిలారు. మార్కుల ట్యాంపరింగ్ ఘటన మరువకముందే.. మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో డిగ్రీ విద్యార్థులకు మొదటి సెమిస్టర్​ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇటీవలె విడుదలైన

Acharya Nagarjuna
Acharya Nagarjuna
author img

By

Published : Apr 27, 2023, 5:44 PM IST

Acharya Nagarjuna University: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని మూల్యాంకన కేంద్రంలో వర్సిటీ సిబ్బంది మరోసారి నిబంధనలకు నీళ్లొదిలారు. మార్కుల ట్యాంపరింగ్ ఘటన మరువకముందే.. మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వవిద్యాలయంలో బీఈడీ మూడో సెమిస్టర్ ఫిజిక్స్ పత్రాల మూల్యంకన జరుగుతోంది. ఏఎన్​యూ పరిధిలోని ఓ బీఈడీ కళాశాలలో పని చేసే అధ్యాపకులు ప్రేమ్​ కుమార్​కు డీఎస్సీ 98లో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌కుమార్‌కు ANUలోని మూల్యాంకన కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

దైవ ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం అక్కడే ఇతర అధ్యాపకులకు విందు ఏర్పాటు చేశారు. మూల్యాంకన జరిగే సమయంలో ఇతరులను ఎవరినీ ఆ ప్రాంతంలోకి రానివ్వరు. అయినా అధ్యాపకులు నిబంధనలు ఉల్లఘించి విందు కార్యక్రమం నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై పీజీ పరీక్షల సమన్వయకర్త ఉదయ కుమార్​ను వివరణ కోసం రెండు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదు. సీటీఏ పూర్ణచంద్రరావును వివరణ కోరగా ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు.

మొదటి సెమిస్టర్​లో ఉత్తీర్ణత.. రెండో సెమిస్టర్లో అరకొర మార్కులు: మరో ఘటనలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులు గత మార్చి 15న విడుదలైన సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో వచ్చిన మార్కులను చూసి ఆవేదన చెందుతున్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత చెందిన కొందరు విద్యార్థులకు.. రెండో సెమిస్టర్ ఫలితాల్లో ఒక మార్కు, మూడు మార్కులు, ఐదు మార్కులు వేశారు. అసలు ఈ మార్కులు కూడా ఎందుకు వేశారో తెలియని అయోమయంలో ఆ విద్యార్థులు ఉన్నారు.

మార్కులు తక్కువ వచ్చిన సబ్జెక్టుకు రూ.500 చెల్లించి రీ వాల్యుయేషన్ చేయించుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని వాపోతున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన తాము ఒక సబ్జెక్టుకు రూ.500 చెల్లించి రివాల్యుయేషన్ చేయించుకొనే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తీర్ణతపైనే తమ భవిష్యత్తు ఉంటుందని, ఉత్తీర్ణత సాధించలేదన్న సాకుతో విద్యార్థినిలకు ఇంట్లో పెద్దలు వివాహం నిశ్చయం చేస్తున్నారని, ఈ కారణంగానే తాము చదువుకు దూరం అవుతున్నామని విద్యార్థినిలు ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేసే సమయంలో నియమించే అధ్యాపకులు ప్రైవేటు కళాశాల నుంచి వచ్చిన వారు కావడంతో వారు సక్రమంగా మూల్యాంకనం చేయలేకపోవడం, సాంకేతిక సమస్యలను అధిగమించలేకపోవడం లాంటి కారణాల వల్లనే తమకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆందోళన చదువుతున్నారు. ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే రీ వాల్యుయేషన్ కోసం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.