గుంటూరు సర్వజనాసుపత్రిలో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వైద్య చికిత్స కొనసాగుతోంది. శస్త్రచికిత్స గాయం నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. 20 గంటలసేపు వాహనంలో తిప్పడం వల్ల మొలల శస్త్రచికిత్స గాయం కాస్త తీవ్రమైందన్నారు. ఆదివారం తలనొప్పితో బాధపడడంతో... ఆయన తలకు సిటీ స్కాన్ నిర్వహించారు. సైనసైటిస్ వల్ల తల నొప్పిగా ఉందని గుర్తించారు. ఇతరత్రా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని తేల్చారు.
శస్త్రచికిత్స గాయం పూర్తిగా తగ్గనందున... డిశ్చార్జి చేయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అచ్చెన్నాయుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యులు సైతం ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఎంపీ గల్లా జయదేవ్ అచ్చెన్నాయుడును పరార్శించేందుకు అనుమతి కోరగా... వైద్యాధికారులు అనుమతించలేదు.
ఇదీ చదవండి:
రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక విడుదల చేసిన ముఖ్యమంత్రి