గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి సయ్యద్ షాజహాన్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం అడవులదీవి పల్లెపాలెంలోని బాలుర బీసీ హాస్టల్‌కు సంబంధించి.. గత 3 నెలల బిల్లులను మంజూరు చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారి సయ్యద్ షాజహాన్ ను కోరారు. ఆ బిల్లులు పాస్ చెయ్యాలంటే జూన్, జులై నెలల బిల్లులకు సంబంధించి 90 వేల రూపాయలు లంచం అడిగారు. లంచం ఇవ్వటానికి ఇష్టంలేని బాధితుడు ఈ నెల 2వ తేదీన అనిశాను ఆశ్రయించారు. ఏటీఎం వద్ద నుంచి 60 వేల రూపాయలు డబ్బులు తీసి ఇస్తుండగా అధికారులు షాజహాన్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిసీలించినట్లు అనిశా ఏఎస్పీ సురేష్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: