ETV Bharat / state

Intermediate Free Books Distribution: ఉచిత పుస్తకాల పంపిణీ బటన్ నొక్కు జగన్​ మామయ్య..!

author img

By

Published : Jul 30, 2023, 10:23 AM IST

Intermediate Free Books Distribution: డూబు డాబు ఎక్కువ.. డొక్కులో ఉప్పు తక్కువ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వ తీరు తయారైంది. గతంలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఉచిత పుస్తకాల సరఫరానూ కూడా ఎత్తేసింది. విద్యారంగంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు బెడుతున్నామని గొప్పలు చెప్పే జగన్‌.. పేద విద్యార్థుల కోసం పది కోట్లు విదల్చడానికి మాత్రం నిధులు లేవంటూ చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాకుండా పిల్లలు, ప్రైవేటు కళాశాలలు.. ఫీజుల రూపంలో చెల్లించిన డబ్బుల్ని.. సొంత ప్రచారానికి వాడేసుకుంటున్నారు.

Etv Bharat
Etv Bharat

ఉచిత పుస్తకాల పంపిణీ బటన్ నొక్కు జగన్​ మామయ్య..!

Intermediate Free Books Distribution: గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పే సీఎం జగన్‌.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు.. ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరాను నిలిపివేశారు. గతంలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఉచిత పుస్తకాలను రద్దు చేశారు. సంస్కరణలకు.. వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని బాకా ఊదుతున్న వైసీపీ సర్కారుకు.. 10కోట్ల రూపాయలతో పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావడం లేదు. మూడేళ్లుగా.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల సరఫరాను ప్రభుత్వం రద్దు చేసింది.

ఇంటర్‌ విద్యామండలి వద్ద నిధులున్నా.. వాటిని ఖర్చు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. పైగా మండలి నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి సీఎం జగన్‌ తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. పిల్లలు, ప్రైవేటు కళాశాలలు చెల్లించే ఫీజుల డబ్బులను తన సొంత ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువగా పేదవారు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల వారే ఉంటారు. ఇలాంటి వారికి పుస్తకాలు ఇచ్చేందుకు నిధుల్లేవంటున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రతి సమావేశంలో నా ఎస్టీ, నా ఎస్సీ , నా బీసీ , నా మైనారిటీ అనే సీఎం జగన్‌కు.. వారికి పుస్తకాలు ఇవ్వాలని మాత్రం గుర్తుకు రావడం లేదా?

రాష్ట్రంలో 476 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా..వీటిల్లో చదువుతున్న విద్యార్థులు లక్షా 21వేల 160మంది ఉన్నారు. వీరికి 44 రకాల టైటిళ్లను ఇచ్చేందుకు 10కోట్ల రూపాయలలోపే వ్యయం అవుతుంది. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు ఇవ్వకపోవడంతో.... పేద విద్యార్థులపై భారం పడుతోంది. మొదటి ఏడాది MPC విద్యార్థులు 1,050రూపాయలు.., రెండో ఏడాది వారికి 11 వందల 70 రూపాయలు... పుస్తకాల వ్యయమవుతోంది. దాదాపుగా అన్ని గ్రూపుల వారు ఇంచుమించుగా ఇదే వ్యయం భరించాల్సి వస్తోంది. గత విద్యా సంవత్సరం 2022-23కు సంబంధించి ఉచిత పుస్తకాల నిధుల కోసం ఇంటర్‌ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఆర్థిక శాఖ మూలకు పడేసింది. 2008-09 నుంచి 2012-2013 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక ప్రసాదం కింద పాఠ్యపుస్తకాలకు నిధులు ఇచ్చింది. 2014-2020 వరకు రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష అభియాన్, ఇంటర్‌ విద్యామండలి నిధులతో పుస్తకాలను అందించారు. సందర్భానుసారం అయా విభాగాల నిధులతో అందించారు. 2020-21లో కరోనా పేరుతో పుస్తకాలను ముద్రించలేదు. ఆ తర్వాత నుంచి ఉచిత పుస్తకాలను ఇవ్వడం మానేశారు.

Medical Students: కేటగిరీలుగా ఎంబీబీఎస్‌ సీట్ల విక్రయంపై వైద్య విద్యార్థుల అభ్యంతరం..

ఉచిత పాఠ్యపుస్తకాలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇంటర్‌ విద్యామండలికి పిల్లలు, ప్రైవేటు కళాశాలలు చెల్లించే ఫీజుల డబ్బులతో రాజకీయ ప్రచారం చేసుకుంటోంది. ఇంటర్‌ విద్యామండలి వద్ద రూ.220కోట్ల వరకు నిధులు ఉంటే వీటిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. జూనియర్‌ కళాశాలల్లో 'నాడు-నేడు' పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలి నిధులు వాడేస్తోంది. 'నాడు-నేడు' 98కోట్ల రూపాయలు మళ్లించారు. పిల్లలు, ప్రైవేటు కళాశాలలు ఫీజుల రూపంలో చెల్లించిన డబ్బులను ఖర్చు చేస్తూ... 'నాడు-నేడు'ను రాజకీయ ప్రచారానికి వాడుకుంటోంది. మరోపక్క పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు ఇవ్వమంటే మాత్రం నిధుల్లేవంటోంది. రాష్ట్ర ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయించుకుంది. వీటిని ఇప్పుడు జూనియర్‌ కళాశాలల్లో 'నాడు-నేడు'కు నిధులు అవసరం కావడంతో మళ్లించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించే 'జగనన్న అణిముత్యాలు' కార్యక్రమానికి ఇంటర్‌ విద్యామండలి నిధులనే వాడేశారు. సీఎం జగన్‌ తన పేరు పెట్టుకొని, పిల్లల ఫీజుల డబ్బులతో ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహణకు సుమారు 8కోట్ల రూపాయలకుపైగా వ్యయం చేశారు. ఈ మొత్తాన్ని ఇంటర్‌ విద్యామండలే భరించింది. సొమ్ము బోర్డుది..ప్రచారం సీఎం జగన్‌ చేసుకున్నారు. ఇలా బోర్డు డబ్బులను ఇష్టారాజ్యంగా మళ్లిస్తూ మరోపక్క ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేదవారికి మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు ఆయనకు చేతులు రావడం లేదు. ఇదేనా గ్లోబల్‌ విద్యార్థులను తయారు చేసే గొప్ప లక్ష్యం? ప్రచారం కోసం పిల్లల ఫీజుల డబ్బులను వదలని సీఎం జగన్‌కు విద్యపై ఉన్న ప్రేమ ఇదేనా? పేద వారికి ఉచిత పుస్తకాలు ఇచ్చేందుకు నిధులు విదల్చని సీఎం జగన్‌ ప్రపంచాన్ని ఏలే వారిని తయారు చేస్తానని చెప్పడాన్ని విద్యావేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.