ETV Bharat / state

మా అవగాహన రాహిత్యం వల్లే అలా జరిగింది: వైకాపా నేత - aanjaneya statue removed issue in pedanandipadu latest news

గుంటూరు జిల్లా పెదనందిపాడులో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం కోసం ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించారు. దీంతో గ్రామంలో వివాదం నెలకొంది. తమ అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరిగిందని..వైకాపా మండల కన్వీనర్ మదమంచి వాసు అన్నారు.

aanjaneya statue removed issue
aanjaneya statue removed issue
author img

By

Published : Jul 9, 2020, 7:55 AM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడులో కొత్తగా సచివాలయం నిర్మిస్తున్న సందర్భంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించారు. దీనిపై వివాదం నెలకొంది. స్పందించిన వైకాపా మండల కన్వీనర్ మదమంచి వాసు వివరణ ఇచ్చారు. అవగాహన రాహిత్యం వల్ల అలా జరిగిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తాము వ్యవహరించే ప్రసక్తే లేదన్నారు. తిరిగి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అదే ప్రదేశంలో దిమ్మె నిర్మించి ప్రతిష్ఠించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామస్థుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా తాము వ్యవహరించమన్నారు. గ్రామస్థులు కలిసి చర్చించి వారి నిర్ణయానికి అనుగుణంగా చేస్తామన్నారు. హోంమంత్రి సుచరిత ఈ విగ్రహం విషయంలో స్పందించారని.. గ్రామస్థులకు, గుడికి ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భయం వద్దు.. ధైర్యంగా ఎదుర్కొందాం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.