గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల సాయిబాబా గుడి ఎదురు వీధిలో షేక్ జానీ బేగం అనే వివాహిత ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
రెండో పట్టణ పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిళ్ల మేరకు తన భార్య ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ అల్లుడు షేక్ ఖాజా వలి అనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమ కుమార్తెను వేధింపులకు గురి చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.కృష్ణయ్య తెలిపారు.
ఇదీ చూడండి..
వైద్యం అందక కరోనా రోగి మృతి... నిన్నటి నుంచి ఇంట్లోనే మృతదేహం!