గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరోజు వయసు గల పసికందును తల్లి ఆసుపత్రిలోనే వదిలి వెళ్ళింది. గత నెల 17 తేదీన ఆసుపత్రిలో చేరిన పావని అనే గర్భిణీ, 28వ తేదీన ఆడపిల్లకి జన్మనిచ్చింది. పుట్టిన పాపకు అరోగ్యం బాగా లేకపోవడంతో 29న పాపను వదిలేసి తల్లిదండ్రులు, బంధువులు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా చిన్నగంజాం గ్రామానికి చెందిన వారిగా పేర్లు నమోదు అయ్యినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..